మెరిసేందుకు మెరుగులు | Remedy For Glowing Skin | Sakshi
Sakshi News home page

మెరిసేందుకు మెరుగులు

Jul 14 2019 12:18 PM | Updated on Jul 14 2019 12:25 PM

Remedy For Glowing Skin - Sakshi

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా నున్నటి.. మృదువైన మేనుకోసం సహజ సిద్ధమైన చిట్కాలని పాటించాలి. అందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి: క్లీనప్‌ : కొబ్బరి పాలు – 2 టేబుల్‌ స్పూన్లు
స్క్రబ్‌ : పెసరపిండి – 1 టీ స్పూన్, పచ్చి పాలు – 2 టీ స్పూన్లు
మాస్క్‌:  అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 1 టీ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్‌
తయారీ: ముందుగా కొబ్బరి పాలను... ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, పచ్చిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని, బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, పెరుగు, నిమ్మరసం కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement