గులాబీ ముళ్లు | love Poem | Sakshi
Sakshi News home page

గులాబీ ముళ్లు

Jan 16 2016 11:49 PM | Updated on Sep 3 2017 3:45 PM

గులాబీ ముళ్లు

గులాబీ ముళ్లు

అన్ని ప్రేమలూ ముళ్ల మధ్య ఉండే అందమైన గులాబీలు కావు కొన్ని గులాబీలు కూడా ముళ్లవుతాయి

  కవిత
 అన్ని ప్రేమలూ ముళ్ల మధ్య ఉండే
 అందమైన గులాబీలు కావు
 కొన్ని గులాబీలు కూడా ముళ్లవుతాయి
 
 అప్పుడప్పుడూ చిరుజల్లుల్లో తడుస్తూ
 ఆనందాన్ని పొందొచ్చు
 ఎప్పుడో ఒకప్పుడు అది పెను తుఫానై
 నిను కబళించనూవచ్చు
 
 ఒకానొక సందర్భంలో ప్రణయానుభూతుల మహిమల్తో
 కాలాన్ని నిలిపేసే ఉంటావు
 కదలనీకుండా
 
 ఒకే ఒక నిమిషంలో కాలం
 దుఃఖ నదిలో పడి
 బండరాయిలా ఉండిపోతావు
 కదలలేకుండా
 
 ఎన్నోసార్లు చల్లగాలుల్లో
 చిగురుటాకులా ఊగిపోగలవు
 ఏదో ఓసారి శిశిర గాలికి
 ఎండుటాకువై రాలితే నీకిక సెలవు
 
 ప్రేమలన్నీ ముళ్ల గులాబీలు కావు
 కొన్ని గులాబీలూ ముళ్లే
 
 - రాశ్రీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement