
ఆఫీస్‌లో హెల్మెట్ తప్పనిసరి!!
రయ్ రయ్‌మంటూ.. దూసుకుపోయే ద్విచక్రవాహనదారుడికి... నెత్తిమీద హెల్మెట్ లేదంటే ఎక్కడోచోట బ్రేక్ పడాల్సిందే. ఫైన్ కట్టాల్సిందే.
రయ్ రయ్‌మంటూ.. దూసుకుపోయే ద్విచక్రవాహనదారుడికి... నెత్తిమీద హెల్మెట్ లేదంటే ఎక్కడోచోట బ్రేక్ పడాల్సిందే. ఫైన్ కట్టాల్సిందే. అందుకే చాలా మంది తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకునే ప్రయాణాలు చేస్తుంటారు. అదే అన్నివిధాలా సురక్షితం కూడా!! కానీ బీహార్‌కు చెందిన ఆ ప్రభుత్వ ఉద్యోగులకి బైక్ దిగి.. ఆఫీస్‌లోకి వెళ్లిన తరువాత కూడా హెల్మెట్ తీసే పరిస్థితి లేదు. అదేంటి బీహార్ పోలీసులు ఏమైనా కొత్త రూల్ తెచ్చారా!? అని ఆలోచిస్తున్నారు కదూ!?! అదే మీ ఆలోచనైతే మీరు తప్పులో కాలేసినట్లే!
బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఆరెరాజ్‌లోని ఒక ప్రభుత్వ భవనం శిథిలావస్తకు చేరుకుని రెండేళ్లవుతోంది. ఎక్కడిక్కడ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. అయినా సరే అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. అందులో పనిచేసే ఉద్యోగులు ప్రాణరక్షణ కోసం హెల్మెట్‌లు ధరించి మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా అక్కడి సర్కారు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.