
వయసు ఐదేళ్లు.. ఎత్తు 5 అడుగుల 7అంగుళాలు
ఎల్కేజీ చదివే పిల్లాడు ఎంత ఎత్తు ఉంటాడు.. సాధారణంగా అయితే మూడు అడుగులు కదూ. కానీ, కరణ్ సింగ్ అనే ఓ కుర్రాడు మాత్రం ఐదేళ్లకే ఏకంగా ఐదడుగుల ఏడు అంగుళాలు పెరిగిపోయాడు.
ఎల్కేజీ చదివే పిల్లాడు ఎంత ఎత్తు ఉంటాడు.. సాధారణంగా అయితే మూడు అడుగులు కదూ. కానీ, కరణ్ సింగ్ అనే ఓ కుర్రాడు మాత్రం ఐదేళ్లకే ఏకంగా ఐదడుగుల ఏడు అంగుళాలు పెరిగిపోయాడు. గట్టిగా మాట్లాడితే, ఎల్కేజీ చదివేసరికే అతగాడు ఐదడులు ఎత్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ పిల్లాడు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. కానీ అదే అతడి తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. ఎల్కేజీలో వేసినప్పుడు పిల్లంతా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయేవారని, నెమ్మదిగా వాళ్లు స్నేహితులయ్యారని కరణ్ తండ్రి సంజయ్ సింగ్ చెప్పారు.
త్వరలోనే కరణ్కు గిన్నిస్ రికార్డు కూడా సొంతమవుతుంది. మరో ఐదు నెలలు గడిస్తే అతడు ఆరేళ్ల వయసుకు వస్తాడు. ఆ వయసుకు ఎవరూ ఇంతవరకు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు పెరగలేదు. ఇంత ఎత్తు కరణ్కు ఎలా వచ్చిందనుకుంటున్నారా? అతడి తల్లి స్వెత్లానా సింగ్ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటారు. అంతేకాదు.. పాతికేళ్ల వయసులో ఇప్పుడు కూడా ప్రతి రెండేళ్లకు ఆమె నాలుగు అంగుళాల చొప్పున పొడవు పెరుగుతున్నారు.
2007లో ఆమెను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి ఆమె 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండేదని, తామిద్దరం సరిగ్గా సరిపోయేలా ఉండేవారిమని సంజయ్ సింగ్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఆమె మరింత ఎత్తు ఎదిగిపోయారు.