 
															మీరెంత ఉన్నతంగా ఆలోచిస్తారు?
మీరు మీ తోటివారితో ఎలా ఉంటారు? అందరూ ఒక్కటేనన్న భావన మీలో ఉందా?
	సెల్ఫ్ చెక్
	
	మీరు మీ తోటివారితో ఎలా ఉంటారు? అందరూ ఒక్కటేనన్న భావన మీలో ఉందా? మీరు ఉన్నతంగా ఆలోచించగలరా? లేదా మీ చుట్టూ ఒక వలయం గీసుకొని అందులోనే ఉండిపోతారా? మీది ఓపెన్‌మైండో లేక న్యారోమైండో తెలుసుకోవాలని ఉందా?
	
	1.    సాహిత్యం, విమర్శనా రచనలు చదవటం అంటే మీకు చాలా ఇష్టం.
	ఎ. అవును      బి. కాదు  
	
	2.    విదేశీ సంగీతమన్నా, విదేశీ వాద్యాలన్నా మీకు ఇష్టం ఉండదు.
	ఎ. కాదు      బి. అవును  
	
	3.     మానవ సంబంధాలపై మీకు వ్యతిరేకతాభావం ఉంది.
	
	ఎ. కాదు      బి. అవును  
	
	4.     స్నేహం చేసే ముందు కులం, మతం, జాతి లాంటి వాటిని చూస్తారు.
	ఎ. కాదు      బి. అవును  
	
	5.     మీ స్నేహాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు.
	ఎ. అవును      బి. కాదు  
	
	6.     జీవితభాగస్వామి మీ విలువులు, నమ్మకాలు, ఆలోచనలతో ఏకీభవించాలని గట్టిగా కోరుకుంటారు.
	ఎ. కాదు      బి. అవును  
	
	7.     మీ పనిని ఎవరైనా తప్పుగా భావిస్తే మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు.
	ఎ. అవును      బి. కాదు  
	
	8.         ఇతరుల గురించి మీకు ఎవరైనా చాడీలు చెబితే అవి నిజమో, కాదో కూడా సరిచూసుకోకుండా వాటిని నమ్మేస్తారు.
	ఎ. కాదు      బి. అవును  
	
	9.    ధనికుల పట్ల మీకెలాంటి భావన ఉందో, పేదలపట్ల కూడా అలాంటి భావనే ఉంది. అందరినీ ఒకేరకంగా మీరు ఆదరించగలరు.
	ఎ. అవును      బి. కాదు  
	
	10.    ఎవరెనా మీ మాటలను వ్యతిరేకిస్తే వెంటనే నొచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకూ వాళ్లతో మీ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలనుకుంటారు.
	ఎ. కాదు      బి. అవును  
	
	మీకు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే  మీరు ఉన్నతంగా ఆలోచించగలరు. మీ భావాలతో తోటివారి మనసును దోచుకుంటారు. జాతి, కుల, మత, వర్గభేదాలు మీలో ఉండవు. మీ దృష్టిలో ఎవరైనా, ఏదైనా సమానమే. మీకు ‘బి’ సమాధానాలు 7 కంటే ఎక్కువ వస్తే మీది సంకుచిత మనస్తత్త్వం కావచ్చు.  మీరు విశాల భావనలను అలవర్చుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడే ఇతరులతో కమ్యూనికేషన్ మెరుగవుతుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
