క్యాన్సర్లను నివారించే క్యాబేజీ

uses of Cabbage - Sakshi

క్యాబేజీ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.  దీనిలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే పేగులకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.  పేగుల్లో వచ్చే అల్సర్స్‌ని నివారిస్తుంది.

క్యాబేజీలో విటమిన్‌ సి, థయోసయనేట్స్, ఇండోల్‌–3–కార్బినాల్, జియాగ్జాంథిన్, సల్ఫరోఫేన్, ఐసోథయోసయనేట్స్‌ వంటి శక్తిమంతమైన జీవరసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్‌ క్యాన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు చెడుకొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను నిరోధించి గుండెకూ, రక్తనాళాలకు మేలు చేస్తాయి. 
 క్యాబేజీలో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌కు చెందిన పాంటథోనిక్‌ యాసిడ్‌ (విటమిన్‌–బి5), పైరిడాక్సిన్‌ (విటమిన్‌–బి6), థయామిన్‌ (విటమిన్‌–బి1) చాలా ఎక్కువ. ఇవన్నీ  మంచి రోగనిరోధకశక్తిని ఇస్తాయి.
♦  క్యాబేజీలో విటమిన్‌ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది.
 అలై్జమర్స్‌ వ్యాధిని క్యాబేజీ సమర్థంగా నివారిస్తుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది.
♦  క్యాబేజీలో ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ ఏ, థయాబిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్‌... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే దీన్ని  సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా చెప్పుకోవచ్చు.
 క్యాబేజీ మలబద్దకం సమస్యను సమర్థంగా దూరం చేస్తుంది.
 క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్‌ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.
 దీని నుంచి వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే స్థూలకాయులకు, బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి ఆహారం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top