వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

Toronto University Scientists Find BP Checkup in Video Selfie - Sakshi

రక్తపోటు తెలుసుకోవాలంటే ఇప్పుడు నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటారా? కేవలం ఒక్క వీడియో సెల్ఫీతో రక్తపోటును లెక్క వేయగల సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది మరి. అధిక రక్తపోటు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఓ తీవ్ర సమస్యగా మారిపోతున్న ఈ తరుణంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తూండటం గమనార్హం. చేతి మణికట్టుకు బిగించుకోగల పరికరాలతో బీపీ చూసుకునే అవకాశమున్నప్పటికీ అవి ఎల్లప్పుడు మన చేతికి అంటిపెట్టుకుని ఉన్న అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో టొరంటో యూనివర్శిటీ శాస్త్రవేత్త కాంగ్‌ లీ ఈ వీడియో సెల్ఫీ టెక్నాలజీని అభివద్ధి చేశారు.

చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్‌వేర్‌తో తాము ముందుగా కొంతమంది ముఖాల వీడియోలు తీశామని.. రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన రక్తపోటు వివరాలకు.. భౌతికంగా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. మెషీన్‌ లెర్నింగ్‌ పద్ధతులను వాడటం ద్వారా ఈ సాఫ్ట్‌వేర్‌ మన ముఖంలోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను గుర్తించి.. దాని ఆధారంగా రక్తపోటును లెక్కకట్టగలదు.  ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు 95 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్‌ లీ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోగలిగితే.. సమీప భవిష్యత్తులోనే అరనిమిషం వీడియో సెల్ఫీ మీ రక్తపోటు వివరాలను అందించవచ్చునని అంటున్నారు కాంగ్‌ లీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top