అద్దండి... రుద్దండి... | Tiles clean Check with sugar | Sakshi
Sakshi News home page

అద్దండి... రుద్దండి...

May 12 2015 11:51 PM | Updated on Sep 3 2017 1:54 AM

అద్దండి... రుద్దండి...

అద్దండి... రుద్దండి...

కాఫీలో చక్కెర తక్కువైతే చుక్క కూడా తాగలేం. చక్కెరతో నోరు తీపి చేయనిదే ఏ శుభవార్తనీ చెప్పలేం.

చక్కెరతో చెక్
కాఫీలో చక్కెర తక్కువైతే చుక్క కూడా తాగలేం. చక్కెరతో నోరు తీపి చేయనిదే ఏ శుభవార్తనీ చెప్పలేం. అయితే చక్కెర రుచినిచ్చేదీ, సంతోషాన్ని రెట్టింపు చేసేది మాత్రమే కాదు... ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా. చేతికి నూనె, గ్రీజు లాంటివి అంటుకుని జిడ్డు వదలడం లేదనుకోండి. అప్పుడు కాసింత చక్కెరను, కొన్ని చుక్కల నీటిని చేతుల్లో వేసుకుని బాగా రుద్దుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకుంటే జిడ్డు మాయమైపోతుంది; వెనిగర్‌లో పంచదార వేసి, కరిగిన తర్వాత ఆ మిశ్రమంతో తుడిస్తే, మొజైక్ నేలమీద ఉన్న మరకలు తొలగిపోతాయి; దుస్తుల మీద మొండి మరకలు ఉంటే... టొమాటో రసంలో చక్కెర కలిపి దాన్ని మరకమీద వేసి కాసేపు నాననివ్వాలి.

ఆ తర్వాత బాగా రుద్దితే మరకలు వదిలిపోతాయి; రోజ్‌వాటర్‌లో చక్కెర వేసి, కరిగిన తర్వాత దానితో వెండి వస్తువులను తోమితే తళతళలాడతాయి; బేకింగ్ సోడా, చక్కెర కలిపి మెత్తని పొడిలా చేసుకుని, దాన్ని నీటిలో కలిపి చిక్కని ద్రావకంలా చేసుకోవాలి. దీనితో కనుక గిన్నెలు కడిగితే... జిడ్డు, మసి పోయి పాత్రలు మెరిసిపోతాయి; నిమ్మరసంలో చక్కెర వేసి కరగనివ్వాలి. ఓ స్పాంజిని ఈ ద్రావకంలో ముంచి తుడిస్తే వస్తువులు, గిన్నెలు, బట్టలు... దేనిమీద పడిన తుప్పు మరకలైనా వదిలిపోతాయి. అలాగే దీనితో కిచెన్లో బండలు తుడిస్తే మురికిపోయి బండలు శుభ్రపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement