గడ్డి అంచున

Telugu Literature: P Srinivas Goud Poetry - Sakshi

కవిత

చాన్నాళ్లయింది
నిన్ను చూసి

నువ్వలా 
ఎదురుచూస్తూనే వున్నావా

గాలి వీచినప్పుడల్లా
నవ్వుతూనే వున్నావా

నీ సమాధి మీద
మొలిచిన మొక్కకు కాసిన
పూల కళ్లలో నుంచి

కలలు కనే
నేలనిద్రలో నుంచి

లేతాకు పచ్చలో నుంచి
∙∙ 
నాటుకున్నాను కదా
పగిలిన
నా ప్రాణవిత్తువి

తలకిందులుగా 
తలపులు కలుస్తాయిగా
మట్టితీగల ఆత్మల్లో

నీ చింతనా చితాభస్మం
రాసుకొని 
సాగుతానిక

సమాధి ముందర
తడిచిన గడ్డి అంచున నిలిచిన
లోకాన

- పి.శ్రీనివాస్‌ గౌడ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top