బ్యూటిప్స్‌ | Rosewater peanut should be added to the face | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Feb 25 2019 1:39 AM | Updated on Feb 25 2019 1:39 AM

Rosewater peanut should be added to the face - Sakshi

శనగపిండితో అందం...
టేబుల్‌ స్పూన్‌ శనగపిండిలో అర టేబుల్‌ స్పూన్‌ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన ముఖానికి పట్టించాలి. ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్‌ స్పూన్‌ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది.

బ్లాక్‌ హెడ్స్‌ నివారణ కోసం...
అయిదారు కప్పుల నీటిలో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్‌ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్‌తో బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్‌ప్యాక్‌ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో  కడిగేయాలి.టేబుల్‌ స్పూన్‌ పెరుగులో టీ స్పూన్‌  బియ్యంపిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత  ఈ మిశ్రమాన్ని బ్లాక్‌ హెడ్స్‌ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్‌హెడ్స్‌ తగ్గుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement