పదమూడు మెట్ల తర్వాత...

Review of Think and Grow Rich - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

రచయిత  నెపోలియన్‌ హిల్‌ ‘థింక్‌ అండ్‌ గ్రో’ పుస్తకాన్ని 1937లో రాశాడు. వంద మిలియన్లకి పైగా ప్రతులు అమ్ముడుపోయాయి. అన్ని భాషల్లోకి అనువదించబడింది. కొన్ని లక్షలమందిని కుబేరులుగా మార్చిన ఈ పుస్తకంలో ఏముంది? క్రైమ్, డిటెక్టివ్, హాస్యం, రొమాన్సు, ఫ్యామిలీ, చరిత్ర, బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకాలు ఎందరో చదువరులను అలరించాయి. ఆ తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సాహిత్యం అందరినీ ఆలోచింపచేసింది. అయితే, ‘డబ్బు’ అనే ఒకే ఒక అంశం మీద అద్భుతమైన వివరణలు, ఉదాహరణలతో కూడిన పాఠ్య పుస్తకం అనవచ్చు దీన్ని. 

అయిదువందల మంది ప్రముఖ ధనికులతో చాలా ఏళ్ల పాటు లోతుగా చర్చించి వారి డబ్బు సంపాదనకి సంబంధించిన రహస్యాలు, కిటుకులు, మొదలైనవి వారినుండే సేకరించి రచయిత నెపోలియన్‌ హిల్‌ మనకు ఈ పుస్తకంలో అందించాడు. వాటన్నింటినీ ‘పదమూడు మెట్లు’గా పొందుపరిచాడు. ఇవి ఆచరిస్తే ఆర్థికంగా ఎవరైనా ఎదగవచ్చు అని సూచించాడు. ‘కలలు కనండి! వాటిని సాకారం చేసుకోండి!’ అని ఎనభై సంవత్సరాల క్రితమే హిల్‌ ఉద్బోధించాడు. ‘పుస్తకంలోని సూత్రాలను అనుసరించి వంద డాలర్లతో ప్రారంభించిన నా సంస్థని ముప్పై ఆరు మిలియన్‌ డాలర్లకి పైగా సంపాదించేలా చేశా’నని ఒక ప్రముఖ అమెరికన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అధినేత డబ్లు్య. క్లెమెంట్‌ స్టోన్‌ చెబుతాడు.

పుస్తకంలోని పదమూడు చాప్టర్లు: వాంఛ, నమ్మకం లేదా విశ్వాసం, స్వీయ సూచన, ప్రత్యేకమైన పరిజ్ఞానం, ఊహాశక్తి, క్రమబద్ధమైన ప్రణాళికా రచన, స్థిరనిర్ణయం, పట్టుదల, మేధా శక్తి,  లైంగికాసక్తిని డబ్బు సంపాదనవైపు రూపాంతరం చెందించడం, అంతర్మనస్సు, మెదడు, అతీంద్రియ జ్ఞానం (సిక్స్‌›్త సెన్స్‌). వాస్తవ సంఘటనలతో కూడిన ధన సంపాదనా రహస్యాలను ప్రస్తావిస్తూ, ఒక ఉపాధ్యాయుడు చిన్నపిల్లలకి చెబుతున్నట్లుగా తేలికైన భాషలో పుస్తకం కొనసాగుతుంది.  
వి.ఎస్‌.పాణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top