కవితలు
కవితవెంకన్న ఒక చెట్టని
పునుగుపిల్లి తైలం పాముతూ చెప్పింది
కాకపోతే
శేషాచలం అడవుల్లో
ఏడుకొండలమీద పూలతో ఎందుకు అలంకరిస్తారు.
ముడుపులు కట్టి అంతదూరం వెళ్లడం
కుదరకపోతే పోనీ
ముడుపు సొమ్ముతో
కొన్ని మొక్కలు కొని నాటు
మళ్లీ మళ్లీ ముడుపులు కట్టు
మళ్లీ మళ్లీ మొక్కలు నాటు
ఒక వనాన్ని పెంచు
చెట్ల మధ్య నీ నిజపాదాలు వెదుకుతూ
వెంకన్న దిగి వస్తాడు.
అప్పుడు వెంకన్న చేతిలో
నీ కోసం
ముడుపు కట్టి తెచ్చిన మొక్క ఉంటుంది.
వర్మ కలిదిండి
9948943337
ఖైదు
విరిసే మల్లియలు గాలి రెక్కలపై ఎగిరి
నీ వొడి చేరి మళ్లీ పుష్పిస్తాయి.
ఆకాశం ఎందుకో నీ చేతుల్లోకి జారి
నా కళ్లపైన మిగిలిపోతాది.
నీ కౌగిట్లో చీకటి వీస్తున్నప్పుడు
శశి నీ నుదుటన.
నా దేహం నుండి నీ దేహం వరకూ
నన్ను నువ్వు ప్రవహింపజేసుకున్నాక
ప్రేమనో... ఖైదునో...
ప్రవాహమూ, సమీరమూ
నీ చెక్కిళ్లపై వొలుకుతున్నప్పుడు
నన్ను నీ చుట్టూ అల్లుకున్న ప్రేమఖైదీని!
గుబ్బల శ్రీనివాస్
09699856777