యవ్వనంగా... విగ్గు | Natural materials in the manufacture of wig | Sakshi
Sakshi News home page

యవ్వనంగా... విగ్గు

Aug 20 2014 11:38 PM | Updated on Mar 28 2019 6:31 PM

యవ్వనంగా... విగ్గు - Sakshi

యవ్వనంగా... విగ్గు

వయసు తక్కువగా కనిపించాలంటే నల్లగా నిగనిగలాడే తలకట్టు ఉండాలి. కానీ, సాధారణంగా వయసు పై బడినవారికి వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువ.

వయసు తక్కువగా కనిపించాలంటే నల్లగా నిగనిగలాడే తలకట్టు ఉండాలి. కానీ, సాధారణంగా వయసు పై బడినవారికి వెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం ఎక్కువ. ఈ వయసులో ఆరోగ్యసమస్యల కారణంగా అందరికీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వీలు పడదు. కానీ, వయసు తక్కువగా కనిపించాలని ఉంటుంది. వీరికి సరైన ఎంపిక ‘విగ్!’
 
ఒకప్పుడు విగ్ పెట్టుకోవాలంటే అసహజంగా అనిపించి వద్దనుకునే వారు. అలా విగ్గులు సినిమా తారలకు మాత్రమే పరిమితమయ్యేవి. నేడు.. జుట్టుకు, విగ్గుకు అస్సలు తేడా తెలియడం లేదు. ‘విగ్’ల తయారీలో సహజమైన మెటీరియల్స్‌ను వాడుతున్నాం. అసలైన కేశాలే అనిపించేలా కొన్ని రకాల మెటీరియల్‌ను విదేశాల నుంచి తెప్పిస్తుంటాం. వయసు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా కొంచెం తెల్లజుట్టు ఉండేలా కూడా విగ్స్ తయారుచేస్తున్నాం.

వీటిలోనూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. తల మొత్తంతో పాటు, ప్రత్యేకంగా బట్టతలను మాత్రమే కవర్ చేసేలా విగ్స్ తయారుచేస్తున్నాం. ఇవి 2/3 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. మెటీరియల్, పొడవును బట్టి 10 వేలనుంచి లక్ష రూపాయల వరకు వీటి ధరలు ఉన్నాయి.
- దీప్తి మువ్వ, లా మార్స్ హెయిర్ సెలూన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement