కళ్లజోడు మచ్చలకు కలబంద

To Make Black Spots Apply Aloe Vera Gel - Sakshi

బ్యూటిప్స్‌

కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే...

►కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలుతగ్గుతాయి

►మచ్చలపై తేనె రాసి, 10–15 నిమిషాల తర్వాతశుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటేమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి

►రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్‌ నీళ్లు వేసిబాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడువల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు

►బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్నచోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి

►నారింజ తొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్న చోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలోని సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది

►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్నిచుక్కల రోజ్‌వాటర్‌ పోసి, పేస్ట్‌ చేసి రాయాలి. ఈవిధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగాతగ్గిపోతాయి

►స్ట్రాబెర్రీలో విటమిన్‌ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top