
పేషెంట్‌కీ బాధ్యత ఉంటుంది?
ఆరోగ్యంగా కనిపిస్తూనే సడెన్‌గా ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతుంటాం.
సెల్ఫ్‌చెక్
ఆరోగ్యంగా కనిపిస్తూనే సడెన్‌గా ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతుంటాం. హాస్పిటల్‌కు వెళ్లడంతో మన బాధ్యత అయిపోయిందనుకుంటుంటాం. కానీ... మన బాధ్యత చాలా ఉంటుంది. మరి... అదేమిటి?
1. డాక్టర్‌ని కలిసే ముందే మీ మెడికల్ హిస్టరీ, ప్రస్తుతం బాధపడుతున్న సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కోసం తీసుకున్న మందుల వివరాలను రాసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
2. డాక్టరు సూచించిన మందులను వాడే ముందు మీకు ఏదైనా మందులు అలర్జీ, రియాక్షన్ కలిగిస్తుంటే తెలియచేస్తారు.
ఎ. అవును బి. కాదు
3. ప్రస్తుతం మీరు బాధపడుతున్న వ్యాధి లక్షణాలను, ఎంత కాలం నుంచి ఉంది, ఎలా మొదలైంది... వంటివన్నీ ముందుగానే మననం చేసుకుని డాక్టరుకు పూర్తి వివరాలను ఇస్తారు.
ఎ. అవును బి. కాదు
4. పరీక్ష కోసం రక్తం, మూత్రాన్ని సేకరించిన కంటెయినర్ మీద వివరాలు çకరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. డాక్టరు రాసిన మందుల పేర్లు అర్థం కాకపోతే మందులు తీసుకున్న తర్వాత వాటిని ప్రిస్కిప్షన్‌తో సరిచూసుకోవాలనుకోరు.
ఎ. అవును బి. కాదు
6. ట్రీట్‌మెంట్ సమయంలో డాక్టరు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఫాలోఅప్ ట్రీట్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేయరు.
ఎ. అవును బి. కాదు
7. ఆనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా మెలగకూడదన్న నియమాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయరు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఐదు అంత కంటే ఎక్కువ వస్తే అస్వస్థత నుంచి కోలుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే... అనారోగ్యానికి గురైన మిమ్మల్ని ఆరోగ్యవంతంగా మార్చే బాధ్యత పూర్తిగా డాక్టరుదే... అన్నట్లు ఉంటారు. అలా కాకుండా పేషెంటుగా మీ బాధ్యతకు న్యాయం చేయండి.