ఐడిఎ తగ్గాలంటే...

ఐడిఎ తగ్గాలంటే...


గుడ్‌ ఫుడ్‌



ఐడిఎ అంటే ఐరన్‌ డెఫిషియెన్సీ ఎనీమియా. భారతీయ మహిళల్లో ఇది ఎక్కువ. రక్తహీనతకు దారి తీసే కారణాలలో ఐడిఎది ప్రధాన పాత్ర. బికాంప్లెక్స్‌ విటమిన్‌...బి12 విటమిన్‌ ఎనీమియా రాకుండా నివారిస్తుంది. ప్రోటీన్లు, కాపర్, అయోడిన్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్‌... తగినంత మోతాదులో తీసుకోవాలి.మెంతిఆకు... టీనేజ్‌ అమ్మాయిలు, మెనోపాజ్‌ దశకు చేరిన మహిళలు తరచుగా మెంతిఆకు లేదా మెంతులు తీసుకుంటే రక్తహీనత రాదు.



పాలకూర... రక్తహీనతను, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది. నువ్వులు... రోజుకు టీ స్పూన్‌నువ్వులు తీసుకుంటే ఐరన్‌లోపం కారణంగా వచ్చిన రక్తహీనత తగ్గుతుంది. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తినవచ్చు. నువ్వులు వేడి చేస్తాయనేది అపోహ మాత్రమే. తేనె... ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్‌ ఉంటాయి. తక్షణశక్తినిస్తుంది, ఎప్పుడు నీరసంగా అనిపించినా గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగవచ్చు. డయాబెటిస్‌ పేషంట్లు తేనె తీసుకోకూడదు. షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి.వీటితోపాటు సాధారణంగా ఆహారంలో అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, టొమాటోలు బాగా తీసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top