ఇన్‌టిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇన్‌టిప్స్‌

Nov 20 2017 11:43 PM | Updated on Nov 20 2017 11:43 PM

  - Sakshi

పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా ఓ తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర.

బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు.క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్‌ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే సరి... అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement