ఆ ఎనిమిది స్నేహాలు అవసరం! | friendship is compulsary | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది స్నేహాలు అవసరం!

Feb 12 2014 12:04 AM | Updated on Mar 21 2019 9:05 PM

ఆ ఎనిమిది స్నేహాలు అవసరం! - Sakshi

ఆ ఎనిమిది స్నేహాలు అవసరం!

చిన్నప్పుడు బలపం అరువిచ్చిన స్నేహం, కాలేజీలో మన పక్కనే కూర్చున్న స్నేహం, ఆఫీసులో ఆత్మీయంగా పలకరించే స్నేహం.... వింటుంటేనే మనసు తేలికపడుతోంది కదా! స్నేహాలు

అధ్యయనం
 చిన్నప్పుడు బలపం అరువిచ్చిన స్నేహం, కాలేజీలో మన పక్కనే కూర్చున్న స్నేహం, ఆఫీసులో ఆత్మీయంగా పలకరించే స్నేహం.... వింటుంటేనే మనసు తేలికపడుతోంది కదా! స్నేహాలు... ఒక్క మగవారిసొమ్మేనా? పెళ్లయ్యాక ఆడవారి స్నేహాలు తగ్గిపోవాలా? చిన్ననాటి స్నేహితుల్ని మరచిపోవాలా? కొత్త స్నేహాలు చేయకూడదా? ఈతరం మహిళల్ని వేధిస్తున్న ప్రశ్నలివి. పెళ్లయ్యాక మహిళలకు ఎనిమిది రకాల స్నేహాలుండాలంటున్నారు మానసిక నిపుణులు. బాధని, సంతోషాన్ని పంచుకోడానికి అన్నివేళలా ఇంటివాళ్లే అనువుకాదు కాబట్టి మనసెరిగిన స్నేహితురాలు చెప్పే కబుర్లు, ఇచ్చే సలహాలు, పంచుకున్న భావాలు మహిళల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.
 
  ఇదే అంశంపై ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రొఫెసర్ జాన్‌బొరేసింకో చేసిన అధ్యయనంలో ఎక్కువమంది స్నేహితులున్న మహిళలకు స్థూలకాయం, మానసిక ఒత్తిడి, గుండెజబ్బులు తక్కువగా ఉన్నాయని తేలింది. స్నేహితులంటే ఒక్క ఇరుగుపొరుగువారనే కాదు చిన్ననాటి స్నేహితులు, కొత్తగా పరిచయమైనవారు. తోటి ఉద్యోగులు, గుడిలో కలిసేవారు, పిల్లలు, భర్త స్నేహితులు, తల్లి, మీరు ఇలా ఎనిమిది రకాల స్నేహితులున్న ఆడవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారన్నది ఆ అధ్యయన సారాంశం. ఒక్కసారి చిన్ననాటి స్నేహితుల చిరునామా కనుక్కుని వారితో కాసేపు కబుర్లు చెప్పుకుంటే ఆ అధ్యయనం చెప్పే పాఠమేమిటో మీకూ అర్థమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement