ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్‌ | exercising together makes your family stronger | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్‌

Feb 28 2017 11:48 AM | Updated on Sep 5 2017 4:51 AM

ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్‌

ఫ్యామిలీతో కలిసి చేస్తే వ్యాయామం బెటర్‌

వ్యాయామంలో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి

లైఫ్‌స్టైల్‌ కౌన్సెలింగ్‌
నా వయసు 45 ఏళ్లు. గత మూడేళ్లుగా నేను డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. వ్యాయామం విషయంలో డయాబెటిస్‌ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రత్నకిశోర్, నూతనకల్‌

డయాబెటిస్‌ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలరు. దీనివల్ల  ఇన్సులిన్‌ పట్ల శరీరం బాగా స్పందించడంతో పాటు ఒంట్లోని చక్కెరపాళ్లు కూడా తగ్గుతాయి. అయితే  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ∙వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులుఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో  కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ∙వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్‌ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు.

ఒకవేళ రక్తంలోని షుగర్‌ పాళ్లు100 ఎంజీ/డీఎల్‌ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటే శ్నాక్స్‌ లేదా ఏదైనా పండు వంటిది తినాలి. ఒకవేళ రక్తంలో చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్‌ లాంటిది ఏదైనా తీసుకోవాలి. ∙మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగా, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. ∙డయాబెటిస్‌ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్‌ న్యూరోపతి) రావచ్చు.  మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్‌ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి.

డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్‌ అండ్‌
రీహ్యాబిలిటేషన్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement