ఆమె బతికేవుంది.. కణాలుగా! | Do not have but your memories | Sakshi
Sakshi News home page

ఆమె బతికేవుంది.. కణాలుగా!

Jun 25 2018 12:38 AM | Updated on Mar 28 2019 6:23 PM

Do not have but your memories - Sakshi

నువ్వు లేవు కానీ నీ జ్ఞాపకాలున్నాయి అని మనకు ప్రియమైన వాళ్లను మళ్లీ మళ్లీ  గుర్తుచేసుకుంటూ బతికిçస్తుంటాం. కానీ హీన్రియెటా లాక్స్‌ విషయంలో ఈ ఉద్వేగం పనిచేయదు. మనిషి కొన్ని కోట్ల కణాల సమూహం అని ఒప్పుకుంటే ఈ ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ ఇప్పటికీ బతికివున్నట్టే లెక్క. కాకపోతే సాంకేతికంగా ఆమె జీవితకాలాన్ని 1920–1951 అని రాయాలంతే. హీన్రియెటా అనారోగ్యంతో 1951లో అమెరికా మేరీలాండ్‌లోని జాన్‌ హాప్కిన్స్‌ హాస్పిటల్‌లో చేరింది. ఆ ప్రాంతంలో అప్పుడు నల్లవారికి చికిత్స చేసే ఆసుపత్రి అదొక్కటే. అప్పటికి ఆమె ఐదుగురు పిల్లల తల్లి. పొగాకు పండించే కుటుంబం వాళ్లది. గర్భాశయంలో చిన్న ముడిలాంటిదేదో ఉన్నట్టు ఆమె అనుకుంది. ఇంట్లోవాళ్లు మళ్లీ గర్భం దాల్చిందేమో అనుకున్నారుగానీ రక్తస్రావం జరిగాక, చాలా పరీక్షల తర్వాత సెర్వికల్‌ కేన్సర్‌ అని తేలింది. అప్పుడు ఆమె ట్యూమర్‌ కణాలను శాంపిల్‌గా తీసుకున్నారు.

ఆ విషయం ఆమెక్కూడా తెలియదు. వాటిని బయాప్సీ చేసిన బయాలజిస్ట్‌ జార్జ్‌ ఆటో గై... యురేకా అని అరిచినంత పనిచేశాడు. ఆమె కణాలు వేగంగా పెరగడమే కాదు, వాటికి మృత్యువనేదే లేదని గుర్తించాడు. సాధారణంగా పరిశోధకులు కణాల మీద చేసే ప్రయోగాల్లో ప్రయోగం కంటే ఆ కణాలను కాపాడుకోవడమే ఎక్కువ ప్రయాస అవుతుంది. కానీ హీన్రియెటా కణాలు ఏ పరిస్థితుల్లోనైనా మనగలిగే గొప్ప గుణాన్ని కలిగివుండటం సృష్టి మర్మం. పది నెలల పోరాటం అనంతరం 31 ఏళ్ల హీన్రియెటా మరణించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల ప్రయోగశాలల్లోనూ జరుగుతున్న బయోమెడికల్‌ రీసెర్చ్‌లో ఆమె కణాలు కీలకమవుతున్నాయి. ఏఉnటజ్ఛ్టీ్ట్చ ఔఅఛిజుటపేరు మీదుగా రూపొందిన హీలా సెల్‌ లైన్‌ వేలాది రోగాల చికిత్స కోసం తయారుచేస్తున్న వేలాది మందులను పరీక్షించడానికి పనికొస్తోంది. 2010లో మాత్రమే ఆమె సేవను అధికారికంగా గుర్తించారు. 2017లో ఆమె జీవితం ఆధారంగా ‘ది ఇమ్మోర్టల్‌ లైఫ్‌ ఆఫ్‌ హీన్రియెటా లాక్స్‌’ పేరుతో సినిమా కూడా వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement