కళ్ల కింద  నలుపు తగ్గాలంటే...

To cut black under the eyes - Sakshi

బ్యూటిప్‌

మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార  లోపం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు  ఏర్పడతాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని  దెబ్బతీస్తాయి. కళ్ల కింద నలుపు తగ్గాలంటే... 

అర టీ స్పూన్‌ బాదంపప్పు పొడి, కొద్దిగా గంధం పొడి, అర టీ స్పూన్‌ బంగాళదుంప రసం, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నల్లని వలయాలున్నచోట మృదువుగా రాయాలి. పదినిమిషాలు కళ్లుమూసుకొని, విశ్రాంతి తీసుకొని, తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరచాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి. గింజలేని ద్రాక్షపండ్లను సగానికి కట్‌ చేసి, నలుపుదనం ఉన్నచోట ఉంచి, పది నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రపరుచుకోవాలి. 

టీ స్పూన్‌ తేనెలో 2–3 కుంకుమపువ్వు రేకలు కలిపిన మిశ్రమాన్ని నల్లనివలయాలు, మచ్చలు ఉన్న చోట రాస్తే నలుపు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.రాత్రి పడుకునే ముందు క్యాబేజీని ఉడికించిన నీళ్లను చల్లార్చి ఆ నీటిని దూది ఉండతో కళ్లకిందా, ముఖమంతా రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖం శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ముఖకాంతి పెరుగుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top