కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..! | current political situation in a humorous outlook on the fun | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!

Mar 31 2017 11:09 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..! - Sakshi

కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!

‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్‌ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్‌. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’

ప్రస్తుత  రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్‌ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్‌. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’  అని అడిగిండు యాదగిరి. ‘ఎవరేసుడేందిరా? బాహుబలి అంటే ప్రభాసే కదా...?’ అన్నడు నర్సింగ్‌. ‘అరెవారీ... నీకు గింతగూడ జన్రల్‌ నాలెడ్జ్‌ లేదురా. మొన్న తెలంగాణ అసెంబ్లీల జానారెడ్డి సారేమన్నడు. కాంగ్రెస్‌ పార్టీకి ఒక బాహుబలి ఒస్తడు... పార్టీని గెలిపిస్తడు అని అన్నడు కదా...’ అన్నడు యాదగిరి.

‘అవ్‌ అవ్‌... జానారెడ్డి సారు గా మాట అనంగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి అసొంటోళ్లు లేసి జానారెడ్డే మా బాహుబలి అని చెప్పిండ్లు కదా ’ అన్నడు నర్సింగ్‌. ‘జానారెడ్డి లెక్కల బాహుబలి అంటే రాహుల్‌ గాంధీ. కోమటిరెడ్డి లెక్కల జానారెడ్డే బాహుబలి. జానారెడ్డి అంటే పడనోళ్లకు మరో లీడర్‌ బాహుబలి. ఇగ కొంతమంది లీడర్లయితే మాకంటే బాహుబలి ఎవరున్నరు అని మనసుల అనుకున్నరు. మరి వీళ్లల్ల రాజమౌళి ఎవరికి బాహుబలి వేషమిస్తడో ఏందో చూడాలె’ అన్నడు యాదగిరి. ‘మొత్తానికి కాంగ్రెసోళ్లందరు బాహుబలికి బాగనే ప్రచారం చేస్తున్నరు... అసలు కాంగ్రెస్‌ల ఎంతమంది బాహుబలులు ఉన్నరే?’ అని అడిగిండు నర్సింగ్‌.

‘కాంగ్రెస్ల బాహుబలులు ఉన్నారో లేదో తెల్వదుగనీ... కట్టప్పలు మాత్రం మస్తు మందున్నరు’ అన్నడు యాద్గిరి. ‘కాంగ్రెస్‌ల ప్రతి ఒక్కడూ కట్టప్పనే. జానా బాహుబలి అయితే పొన్నాల కట్టప్ప అయితడు... కోమటి రెడ్డి బాహుబలి అయితే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కట్టప్ప అయితడు’ అని యాదగిరి చెబుతుంటే... ‘మరి అట్లయితే భళ్లాల దేవుడెవర్రా?’ అని అడిగిండు నర్సింగ్‌. ‘పిసిసి ప్రెసిడెంట్‌ కుర్చీల ఎవరు కూసుంటే వాళ్లే భళ్లాల దేవుడు’ అన్నడు యాదగిరి. అబ్బర నాయనా... మస్తు చెప్పినవ్‌... అన్నడు నర్సింగ్‌.
– ఓరుగల్లు శ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement