ఇదిగో పిల్లి... అదిగో తోక..! | This Cat Holds a Guinness World Record for Longest Tail | Sakshi
Sakshi News home page

ఇదిగో పిల్లి... అదిగో తోక..!

Oct 8 2017 10:47 AM | Updated on Aug 21 2018 2:34 PM

This Cat Holds a Guinness World Record for Longest Tail - Sakshi

అనగనగా ఓ పిల్లి.. దానికో తోక. అవును పిల్లికి ఓ తోక ఉంటుంది..! అయితే ఏంటి అనేగా మీ అనుమానం. అంటే, ఇక్కడ మన పిల్లి తోక కాస్త పెద్దది లేండి. పెద్దది అంటే చాలా పొడవని ఇక్కడ దాని అర్థం. ఎంత పొడవంటే... గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించేంత పొడవన్న మాట. ఇంతకీ ఇంత వింతైన పిల్లి ఎక్కడుందబ్బా అనుకుంటున్నారా? అమెరికాలోని విల్‌ పవర్స్, లారెన్స్‌ దంపతుల ఇంట్లో ఉంది. అది వారి పెంపుడు పిల్లి. దాని పేరు ‘సిగ్నస్‌’. వారు దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజురోజుకూ దాని తోక పొడవు పెరగడం చూసి ఆశ్చర్యపోయారు. వారే కాదు.. ఇప్పుడు 18.4 ఇంచుల పొడవు తోకతో వరల్డ్‌ గిన్నిస్‌ రికార్డులోకి చేరిన సిగ్నస్‌ను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోవడంతో పాటు భలే ముచ్చట పడుతోంది. అంతేకాదు, దాని సోదర పిల్లి ఆర్క్‌చురస్‌ 19.05 ఇంచుల పొడవుతో ఈ ఏడాదే ప్రపంచంలోకెల్లా పొడవైన పిల్లిగా ప్రపంచ గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కింది. రికార్డులు సాధించిన రెండు పిల్లులూ తమ వద్దే ఉండటంతో.. వాటి యజమాని దంపతుల సంతోషానికి అవదుల్లేవనుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement