బ్యూటిప్స్ | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్

Published Tue, Aug 16 2016 11:05 PM

బ్యూటిప్స్

కొన్ని గులాబి రేకులను గంటపాటు పాలలో నానబెట్టాలి. తర్వాత పాలలోంచి తీసేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పాలక్రీమ్, తేనె కలిపి పెదవులకు పూసి... అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. చిట్లిపోయి ఇబ్బంది పెడుతోన్న పెదవులు మళ్లీ అందంగా, ఆరోగ్యంగా అవ్వడానికి ఇది మంచి చిట్కా.  {దాక్షపళ్లను మెత్తగా చిదిమి, కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంతో పెదవులను రుద్దుకుంటే పగుళ్లు పోయి, పెదవులు మృదువుగా తయారవుతాయి.

     
బీట్‌రూట్‌ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత క్రీమ్, తేనె, రోజ్‌వాటర్ కలిపి పెదవులకు రాయాలి. గంట తర్వాత కడిగేసి, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే... పెదవులు పొడిబారడం, చిట్లటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో రోజ్‌వాటర్, తేనె కలిపి... ఆ మిశ్రమంతో పెదవులను బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే వారం రోజుల్లో చిట్లిన పెదవులు మామూలుగా అయిపోతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement