వెదురు చక్రం కరోనా హీరో

Bamboo Furniture For Coronavirus Patients Isolation Wards - Sakshi

కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్‌. హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ల కోసం ఇది బాగా పని కొస్తుందని ఈశాన్య రాష్ట్రాల హాస్పిటళ్లు ఈ ఫర్నిచర్‌ మీద ఆసక్తి చూపిస్తున్నాయి. వెదురు మంచం, వీల్‌ చెయిర్, కంప్యూటర్‌ టేబుల్, రైటింగ్‌ టేబుల్, ఐవీ ఫ్లూయిడ్స్‌ స్టాండ్‌... మొదలైన వస్తువులను వెదురుతో చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌కు అవసరమైన ఫర్నిచర్‌ అంతటినీ వెదురుతోనే చేస్తున్నారు. ఒక పేషెంట్‌కు వాడిన వస్తువులను మరొకరికి వాడాల్సిన పని ఉండదు. ఒకసారి వాడిన తర్వాత వీటిని కాల్చేయవచ్చు. ఈ ఫర్నిచర్‌ రూపకర్త ఓ ప్రొఫెసర్‌. పేరు రవి మోకాశి పూనేకార్‌. అతడు గువాహటిలో ఐఐటీలో ప్రొఫెసర్‌.

పదేళ్ల నాటి ప్రయోగం
ఈశాన్య రాష్ట్రాల్లో 140 రకాల వెదురు చెట్లు పెరుగుతాయి. చాలా త్వరగా పెరిగే జాతులున్నాయి. నరికిన కొద్దీ పక్కన పిలకలు వేస్తూ పెరుగుతాయి. కాబట్టి సహజ వనరులను వృథా చేయడమనేది ఉండదు. వెదురు కలపతో పేషెంట్లకు అవసరమైన ఫర్నిచర్‌ను తయారు చేయడం ద్వారా పర్యావరణ హితమైన వస్తువులను వాడడం, ఒకసారి వాడిన వాటిని మరొకరికి వాడకుండా శుభ్రత పాటించడం సాధ్యమవుతుంది... అన్నారు రవి మోకాశి పూనేకార్‌. నిజానికి అతడు పదేళ్ల కిందట హాస్పిటళ్లలో వినియోగానికి ఇది మంచిదనే ఉద్దేశంతో వెదురు ఫర్నిచర్‌కు రూపకల్పన చేశాడు. వాటిని పరిశీలించిన నిపుణులు బాగా ఉపయోగపడతాయని, మంచి ప్రయత్నం అని ప్రశంసలైతే ఇచ్చారు. వాటిని హాస్పిటళ్ల కోసం తయారు చేయించుకోవడం మాత్రం జరగలేదు. ఇప్పుడు కోవిడ్‌ కష్టకాలంలో ఒకరికి వాడిన వస్తువులను మరొకరు వాడడానికి పేషెంట్‌లు ఏ మాత్రం ఇష్టపడకపోవడంతో హాస్పిటళ్లు, ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లు కూడా ఒకసారి వాడి కాల్చి పడేసే వెదురు ఫర్నిచరే బెస్ట్‌ అంటున్నారు. తన ఫార్ములా ఇప్పుడు ఉపయోగపడుతోందనే సంతోషం కంటే కోవిడ్‌ కారణంగా వడ్రంగులకు చేతి నిండా పని దొరుకుతోందని సంతోషిస్తున్నారు ప్రొఫెసర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

13-07-2020
Jul 13, 2020, 09:35 IST
కరోనా జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా నియంత్రణ విధులు నిర్వహించే పోలీస్‌ విభాగంలోనూ కలకలం సృష్టిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత నాలుగు నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌ రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 06:59 IST
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క...
13-07-2020
Jul 13, 2020, 04:22 IST
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా...
13-07-2020
Jul 13, 2020, 03:57 IST
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు...
13-07-2020
Jul 13, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి : ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో భాగంగా సర్కారు మరింత వేగాన్ని పెంచింది. ఏఎన్‌ఎంల ద్వారా...
13-07-2020
Jul 13, 2020, 03:33 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు. అమెరికాలో కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న సమయంలోనూ మాస్క్‌...
13-07-2020
Jul 13, 2020, 03:31 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,000 మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లోఆస్పత్రుల...
13-07-2020
Jul 13, 2020, 03:25 IST
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి జీజీహెచ్‌లో చికిత్స పొందారు. 14 రోజులు...
13-07-2020
Jul 13, 2020, 03:24 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి....
13-07-2020
Jul 13, 2020, 03:11 IST
మాస్కో: కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు చీకట్లో చిరుదీపంలా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే...
13-07-2020
Jul 13, 2020, 02:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై...
12-07-2020
Jul 12, 2020, 19:29 IST
ముంబై :  బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్‌, ఆయన తనయుడు...
12-07-2020
Jul 12, 2020, 16:55 IST
లండన్‌: ఒక ఔష‌ధాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ముందుగా దాన్ని ప్ర‌యోగించాలి. ఆ ప్ర‌యోగం స‌ఫ‌ల‌మైతేనే అది మార్కెట్లోకి వ‌చ్చేది.. లేక‌పోతే దాన్ని...
12-07-2020
Jul 12, 2020, 13:01 IST
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ..
12-07-2020
Jul 12, 2020, 13:00 IST
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామన్న ప్రభుత్వం
12-07-2020
Jul 12, 2020, 12:46 IST
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్‌ రాజన్‌ సింగ్‌ సింగ్రౌలీలోని ఖాతుర్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా అభయ్‌ భార్యకు కరోనా...
11-07-2020
Jul 12, 2020, 12:34 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 12:28 IST
కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు.
12-07-2020
Jul 12, 2020, 12:20 IST
సాక్షి, ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో ఉండే మేనమామ వద్దకు వెళ్తే కరోనా సోకింది.. ధైర్యంతో ఆ మహమ్మారిని జయించిన యువకుడు ఆనందంగా ఇంటి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top