ప్రియా.. ప్రియా.. చంపొద్దే! | 2.3 million on Insta: Priya Prakash Varrier beats Dulquer, Anushka | Sakshi
Sakshi News home page

ప్రియా.. ప్రియా.. చంపొద్దే!

Feb 16 2018 12:36 AM | Updated on Feb 16 2018 12:36 AM

2.3 million on Insta: Priya Prakash Varrier beats Dulquer, Anushka - Sakshi

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ : పాటలోని క్లిప్పింగ్స్‌ 

సోషల్‌ మీడియా ఎప్పుడు ఎవర్ని సెలబ్రిటీని చేస్తుందో ఊహించలేం! త్రిస్సూర్‌లో బీకాం ఫస్టియర్‌ చదువుతున్న మలయాళీ అమ్మాయి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇప్పుడు లేటెస్ట్‌ సెలబ్రిటీ! ఈ „ý ణమో, మరుక్షణమో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్‌ల సంఖ్య 30 లక్షలకు చేరుకోబోతోంది! అసలు ప్రియ 87వ పోస్టింగ్‌ దగ్గరే ఆమె ఫాలోవర్లు సుమారు 20 లక్షల ఎనభై వేలు! ఇది మామూలు విషయమేం కాదు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ మూవీ స్టార్‌ మోహన్‌లాల్‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వెనుక ఇంతమంది అనుచరుల్లేరు. 7 లక్షల 14 వేల దగ్గర వాళ్ల అడుగులు ఆగిపోయాయి. అది కూడా ఆయన 2015లో నెట్‌లోకి ప్రవేశిస్తే.. ఇప్పటికి ఇంతమంది అయ్యారు.  

మరో మలయాళీ స్టార్‌ మమ్ముట్టి తనయుడు, యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌కి కేరళలోనే కాకుండా, తమిళనాడులోనూ పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు, íß ందీ చిత్రాల్లో కూడా హీరోగా చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు అతడి ఫాలోవర్స్‌ 10 లక్షల 90 వేలు.  అతడి పోస్టింగ్స్‌ 150.  బాహుబలి తర్వాత అనుష్కాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ 20 లక్షలకు పెరిగారు. అయితే 463 వరకు ఆమె పోస్టింగ్‌లు ఉన్నాయి. ఆ మాత్రానికి ఈ మాత్రం ఫాలోయింగ్‌ ఎటూ ఉంటుంది. పైగా అనుష్క బిగ్‌ స్టార్‌. త్రిష పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోఉన్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించారు. మలయాళంలో తొలిసారి ఆమె నటించిన ‘హే జ్యూడ్‌’ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్‌లు పది లక్షల 50 వేల మంది.  

ఇక మోడల్‌ మిలింద్‌ సోమన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా ఫొటోగ్రాఫ్స్‌ని అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఆయన ఫాలోవర్లు 2 లక్షల 49 వేల మంది. ఆయన పోస్ట్‌లు 488. తమిళ్‌ బిగ్‌బాస్‌ ఫేమ్‌ ‘ఓవియా’.. ఆ ‘షో’లో ఉన్నంత కాలం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ గ్రాఫ్‌ పెరుగుతూనే ఉంది. లక్షా 54 వేల మంది ఓవియాను ఫాలో అయ్యారు. వీళ్లందరిదీ ఫాలోవర్‌ల సంఖ్య తక్కువేం కాదు కానీ.. ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క 24 గంటల్లోనే 6 లక్షల 6 వేల మంది ఫాలోవర్లు వచ్చి చేరడం రికార్డ్‌ అయింది. ఇలా ఇంత తక్కువ టైమ్‌లో ఫాలోవర్స్‌ని రాబట్టుకున్న వారిలో అమెరికన్‌ టీవీ స్టార్, మోడల్‌ కైలీ జెన్నర్‌ (8 లక్షల 6 వేలు), ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (6 లక్షల 50 వేలు) తర్వాత ప్రియే కావడం సెన్సేషన్‌ అయింది. ఇదంతా కూడా ‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే.. ఇంకా విడుదల కాని సినిమాలోని చిన్న లవ్‌ సీన్‌లో ప్రియ ‘కన్నుగీటే’ సీన్‌ కారణంగానే. ఇంటర్నెట్‌లో ఆ సన్నివేశం నిర్విరామంగా షేర్‌ అవుతూనే ఉంది, ప్రియ ఫాలోవర్‌ల సంఖ్యను పెంచుతూనే ఉంది. ప్రియ తొలి చిత్రం ఇది. ప్రస్తుతం ఆమె త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్‌’లో చదువుతోంది.  మలయాళీ నటి అమలాపాల్‌ మలయాళంలో, తమిళంలో,  తెలుగులో కూడా బాగా పాపులర్‌. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్‌లు  పది లక్షల 20 వేలు.  ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు 323.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement