ఆ కిరీటం ఆమెకే.. | deepika emerges sexiest women alive in second time | Sakshi
Sakshi News home page

ఆ కిరీటం ఆమెకే..

Oct 18 2017 11:02 AM | Updated on Jul 23 2018 8:49 PM

deepika emerges sexiest women alive in second time - Sakshi

సాక్షి,ముంబయి: బాలీవుడ్‌ అందాల భామ దీపికా పడుకోన్‌ ప్రపంచంలో జీవించిఉన్న అత్యంత సెక్సీయస్ట్‌ ఉమెన్‌గా వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. గత ఏడాది ప్రముఖ ప్రచురుణ సంస్థ నిర్వహించిన వార్షిక యూత్‌ సర్వేలోనూ ఆమె ఈ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ ఏడాది 33 శాతం ఓట్లతో దీపిక తన పోటీదారులను పక్కకునెట్టి అందాల కిరీటాన్ని అందుకున్నారని డీఎన్‌ఏ వెల్లడించింది. 2007లో షారూక్‌ ఖాన్‌ సరసన ఓంశాంతి మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దీపికా అంతకుముందే కన్నడలో ఐశ్వర్య అనే సినిమాలో నటించారు.

గత ఏడాది ఆమె విన్‌డీజిల్‌తో కలిసి రిటన్‌ ఆఫ్‌ కేజ్‌ మూవీతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన దీపిక తాజాగా సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతిలో లీడ్‌ రోల్‌ పోషించారు. పలు వివాదాల నడుమ ఈ చారిత్రక దృశ్య కావ్యం డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement