మేల్‌ వర్సెస్‌ ఫీమేల్‌  కాకూడదు | Male vs. female should not be | Sakshi
Sakshi News home page

మేల్‌ వర్సెస్‌ ఫీమేల్‌  కాకూడదు

Apr 11 2018 12:46 AM | Updated on Apr 3 2019 6:34 PM

Male vs. female should not be - Sakshi

హాలీవుడ్‌లో హార్వీ వెయిన్‌స్టీ  లైంగిక వేధింపుల విషయం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా మంది హీరోయిన్స్‌ ‘మీటూ’ అంటూ ముందుకొచ్చి తమకు జరిగిన సంఘటనలు బయటపెట్టారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటం కోసం హాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ కలిసి ‘టెమ్స్‌ అప్‌’ అనే మూమెంట్‌ను స్థాపించారు. ఇదో ఫండ్‌రైజింగ్‌ ఆర్గనైజేషన్‌. ‘టైమ్స్‌ అప్‌’ సంస్థ అవసరం ఇక్కడ కూడా ఉందా? అని  బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ ని అడిగితే.. ‘‘ కచ్చితంగా ఉంది.

‘టైమ్స్‌ అప్‌’ లాంటి మూమెంట్‌ను ప్రమోట్‌ చేయడానికి నేను రెడీ. హాలీవుడ్‌ సెలబ్రిటీల్లాగా నేనూ దీన్ని ప్రమోట్‌ చేస్తాను. కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాకుండా జెండర్‌ ఈక్వాలిటీ కూడా ఇందులో డిస్కస్‌ చేయాలి. మనం స్త్రీలను కాపాడుకోవాలి అంటుంటాం కదా.. అలాగే కొందరు పురుషులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఉద్యమాలన్నీ కూడా మేల్‌ వర్సెస్‌ ఫీమేల్‌ పోరాటంలాగా జరగకూడదు. కేవలం రైట్‌ వర్సెస్‌ రాంగ్‌గా జరిగితే బావుంటుంది అని అభిప్రాయపడుతున్నా’’ అని పేర్కొన్నారు దీపిక.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement