మోడీ, రాహుల్‌ది కుంచిత స్వభావం:హరీష్‌రావు | TRS leader Harish Rao little touchy on narendra modi | Sakshi
Sakshi News home page

మోడీ, రాహుల్‌ది కుంచిత స్వభావం:హరీష్‌రావు

Apr 24 2014 5:35 AM | Updated on Mar 22 2019 5:33 PM

మోడీ, రాహుల్‌ది కుంచిత స్వభావం:హరీష్‌రావు - Sakshi

మోడీ, రాహుల్‌ది కుంచిత స్వభావం:హరీష్‌రావు

జాతీయ నాయకులని చెప్పుకునే నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చేసరికి ఎందుకో కుంచిత స్వభావాన్ని చాటుకుం టున్నారని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు.

టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు మండిపాటు

సిద్దిపేట,న్యూస్‌లైన్: జాతీయ నాయకులని చెప్పుకునే నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చేసరికి ఎందుకో కుంచిత స్వభావాన్ని చాటుకుం టున్నారని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్టు చదివి రాహుల్‌గాంధీ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శించారన్నారు. చంద్రబాబు చెప్పమన్న మాటలే చెప్పి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజ ల దృష్టిలో అభాసు పాలయ్యారని విమర్శించారు. మోడీ కేసీఆర్‌ది కుటుంబపాలన అనడం అర్థరహితమన్నారు. చంద్రబాబుది, పవన్ కల్యాణ్‌ది కుటుంబపాలన కాదా? అని ప్రశ్నించారు. మేం ఉద్యమాలు చేసి జైళ్లపాలైన విషయాలేవీ గుర్తుకురావడం లేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, కూతురు పురందేశ్వరి, అల్లుడు చంద్రబాబులు ఎన్నికల్లో పోటీచేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవితో పాటు ‘జనసేన’ అధ్యక్షుడు పవన్, మామ అల్లు అరవింద్ పార్టీని గత ఎన్నికల్లో నడిపించింది కుటుంబపాలన కాదా? అని ప్రశ్నించారు. మోడీ మాస్క్‌తో పవన్ ముసుగుతో చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement