అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో హిందూపురం లోక్సభ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను ఘెరావ్ చేశారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో హిందూపురం లోక్సభ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను ఘెరావ్ చేశారు. ఎమ్మెల్సీ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కిష్టప్పపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ నిమ్మల కిష్టప్ప గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు.
ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో ఎంపీగా విఫలమయ్యారని మండిపడుతూ ఈ సందర్భంగా కార్యకర్తలు తోపులాటకు దిగారు. ఇంతలో ఆయనకు అనుకూలంగా ఉండే ఓ కార్యకర్త నిమ్మల కిష్టప్ప జిందాబాద్ అనడంతో రెండు వర్గాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.