రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారి తీసింది. టిడిపి-కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారి తీసింది. టిడిపి-కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలంలో ఈ గొడవ జరిగింది.
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కొంత మంది కార్యకర్తలకు స్వల్పగాయాలుకాగా, నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు ఘటనా స్థలంలో పికెట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.