ఓటుతో శోభమ్మకు నివాళి | shobha nagireddy to vote with tribute | Sakshi
Sakshi News home page

ఓటుతో శోభమ్మకు నివాళి

May 18 2014 2:26 AM | Updated on Aug 14 2018 4:24 PM

దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి ఓటువేసి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిజమైన నివాళులర్పించారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి ఓటువేసి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిజమైన నివాళులర్పించారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా భూమా స్వగృహానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించినా ఓటు వేసి గెలిపించారన్నారు. ఆమె చేసిన సేవలను నియోజకవర్గ ప్రజలు మరువలేదన్నారు. మరణించిన అభ్యర్థిని గెలిపించిన సంఘటనలు ఎక్కడా లేవన్నారు. ప్రజల అభిమానం వల్లే 18 వేల మెజార్టీ వచ్చిందన్నారు.

సీనియర్ నాయకురాలు శోభమ్మను కోల్పోవడం వైఎస్సార్సీపీకి తీరని లోటన్నారు. ఆమె మృతిని తమ కుటుంబంతోపాటు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. శోభానాగిరెడ్డి ఆశయాల సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ ప్రజలు తమ కుటుంబం వెంట ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ధైర్యంగా ఎదుర్కొ నే నాయకులు, కార్యకర్తలు ఉండడం తమకు వరమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement