మనుషులెవరూ నన్ను ఓడించలేరు! | No human being, or party can defeat me, says Bappi Lahiri | Sakshi
Sakshi News home page

మనుషులెవరూ నన్ను ఓడించలేరు!

Mar 28 2014 1:13 PM | Updated on Sep 2 2017 5:18 AM

మనుషులెవరూ నన్ను ఓడించలేరు!

మనుషులెవరూ నన్ను ఓడించలేరు!

కాషాయ కండువా కప్పుకున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

కోల్కతా: కాషాయ కండువా కప్పుకున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తన గెలుపుపై ఆయన అతివిశ్వాసంతో ఉన్నట్టు కనబడుతోంది. తనను దేవుడు తప్ప మనుషులెవరూ ఓడించలేరంటూ ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

'దేవుడు మాత్రమే ఓడించగలడు లేదా నాశనం చేయగలడు. ఏ మనిషి లేదా ఏ పార్టీ నన్ను ఓడించలేదు' అని ఎన్నికల ప్రచారంలో బప్పీలహరి వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా శ్రీరాంపూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోడీ నాయకత్వంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 'డిస్కో కింగ్' అంటున్నారు.

తన ఎన్నికల ప్రచారానికి ప్రజలను మంచి స్పందన వస్తోందని బప్పీలహరి చెప్పారు. ఎన్నికలయ్యాక కనబడకుండాపోయే సెలబ్రిటీ రాజకీయ నాయకున్ని కాదని స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఆయన హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement