breaking news
Hooghly district
-
కోల్‌కతాలో మొదటి మహిళా అధికారి మృతి
కోల్‌కతా: కోల్‌కతాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో మహిళా పోలీసు అధికారి దేబశ్రీ చటర్జీ మరణించారు. కాగా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అధికారులు, దేబశ్రీ చటర్జీ డ్రైవర్, వ్యక్తిగత గార్డ్లు మరణించారు. అయితే కొల్‌కత్తలో మొదటి మహిళా పోలీసు అధికారి(12వ బెటాలియన్ కమాండెంట్లో ఇన్చార్జిగా) దేబశ్రీ చటర్జీ విధులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తె దేబశ్రీ చటర్జీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని హోడ్లా జిల్లా దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కోల్‌కతాకు ప్రయాణిస్తుండగా భారీ ట్రక్కు(ఇసుకతో నిండిన) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దేబశ్రీ చటర్జీ, ఆమె బాడీగార్డ్ తపస్ బర్మన్, డ్రైవర్ మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే చికిత్స కోసం వీరిని ఐబీ సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ముగ్గురిని డాక్టర్ పరిశీలించి, మృతి చెందినట్లుగా ద్రువీకరించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి సీనియర్ పోలీసులు అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. మరోవైపు సైబర్ సెల్, మహిళల రక్షణ, డిటెక్టివ్ విభాగాలలో ముఖ్య విభాగాలలో దేబశ్రీ చటర్జీ కీలక పాత్ర పోషించారు -
మనుషులెవరూ నన్ను ఓడించలేరు!
కోల్‌కతా: కాషాయ కండువా కప్పుకున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తన గెలుపుపై ఆయన అతివిశ్వాసంతో ఉన్నట్టు కనబడుతోంది. తనను దేవుడు తప్ప మనుషులెవరూ ఓడించలేరంటూ ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 'దేవుడు మాత్రమే ఓడించగలడు లేదా నాశనం చేయగలడు. ఏ మనిషి లేదా ఏ పార్టీ నన్ను ఓడించలేదు' అని ఎన్నికల ప్రచారంలో బప్పీలహరి వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోడీ నాయకత్వంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 'డిస్కో కింగ్' అంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజలను మంచి స్పందన వస్తోందని బప్పీలహరి చెప్పారు. ఎన్నికలయ్యాక కనబడకుండాపోయే సెలబ్రిటీ రాజకీయ నాయకున్ని కాదని స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఆయన హామీయిచ్చారు.