ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు! | IN one house 211 fraud votes | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!

Apr 11 2014 2:45 AM | Updated on Aug 14 2018 4:21 PM

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు! - Sakshi

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!

ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది.

కర్నూలు, న్యూస్‌లైన్: ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది. కర్నూలు నగరం 26వ వార్డులోని అరోర నగర్ (బీక్యాంపు)లోని 73వ బూత్‌లో సీరియల్ నం.613 నుంచి 824 వరకు 49-50ఏ-87 ఇంటి నంబరుపై 211 మంది ఓటర్లు ఉన్నారు.

76వ బూత్ పరిధిలోని వరుస నం. 364 నుంచి 423 వరకు 49-50ఏ-87సీ ఇంట్లో 59 మంది ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పేర్లు ఉన్నాయి. అసలు ఆ నంబరుతో ఇల్లేలేదు. వీరందరూ బోగస్ ఓటర్లే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓటర్లు ఉన్నారని గురువారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అశోక్‌బాబుకు వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement