ఎస్ఎస్‌జేలో జర్నలిజం కోర్సుకు దరఖాస్తుల‌ ఆహ్వానం

Sakshi School of Journalism SSJ 2019 Admission Notification

చరిత్ర రచనలో సాక్షిగా నిలవండి కొత్త చరిత్రను మీరే లిఖించండి. పాత్రికేయం అంటే మామూలు ఉద్యోగం కాదు, అదొక యజ్ఞం. నిజాల నిగ్గు తేల్చుతూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం. మీలో ఆ నిబద్ధత ఉంటే మేము ముందుకు నడిపిస్తాం. ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం’ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. సమాజంలో గౌరవం, కీర్తితో పాటు ఉపకారవేతనం కూడా సంపాందించండి.
    
పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సుశిక్షితులైన జర్నలిస్టులను అందించే లక్ష్యంతో ఏడాది వ్యవధి కలిగిన ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జర్నలిజం’ కోర్సును సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అందిస్తోంది. (ఈ కోర్సు సాక్షి మీడియా స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని ఏ ఇతర విద్యాసంస్థతోనూ ఎటువంటి సంబంధం లేదు.) రిపోర్టింగ్, రైటింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, స్కిప్ట్రింగ్, ప్రోగ్రామింగ్‌ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆయా రంగల్లో తీర్చిదిద్దుతాము. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫుల్లీ ఫంక్షనల్‌ న్యూస్‌ రూం, టి.వి స్టూడియో వంటి సౌకర్యాల మధ్య విద్యాభ్యాసం చేసే అవకాశం వల్ల  ప్రింట్‌ పబ్లిషింగ్, ఆన్‌ లైన్‌ కంటెంట్, టీవీ ప్రోగ్రామింగ్‌ విభాగాల్లో చక్కటి అనుభవం లభిస్తుంది. తరగతి గదుల్లో ఇచ్చే శిక్షణతో పాటు న్యూస్‌ రూముల్లో ఇచ్చే శిక్షణతో మరింత మెరుగుపడతారు.

దరఖాస్తులు : 
www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్లో అన్ని విధాలా దరఖాస్తు పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడే రూ. 250 ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత  ఒక యూనిక్‌ నెంబరు వస్తుంది. ఆ నెంబరును దరఖాస్తుపై పేర్కొంటూ, పూర్తి చేసి ఆన్‌లైన్లోనే సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ లభిస్తుంది. దాన్ని ఉపయోగించి జూన్‌ 4వ తేదీ 2019 నుంచి ఆన్‌లైన్లో హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.  

రెండు దశల ఎంపిక : 
విద్యార్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ , కరెంటు అఫైర్స్‌ అంశాల్లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌లో వ్యాసరూప, ఆంగ్లం నుంచి తెలుగులో అనువదించే ప్రశ్నలుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాక్షి పబ్లికేషన్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మోడల్‌ పేపర్లు www.sakshischoolofjournalism.com, www.sakshieducation.com వెబ్‌ సైట్లలో లభిస్తాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండో దశలో గ్రూప్‌ డిస్కషన్, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు.

అగ్రిమెంట్‌ : 
ఎంపికైన అభ్యర్థులు 4 ఏళ్ల పాటు (శిక్షణ సమయం కలుపుకొని) సాక్షిలో పని చేయాలి. ఆరంభంలోనే ఒప్పందపత్రం ఇవ్వాలి. అభ్యర్థులు సాక్షికి సంబంధించిన ఏ విభాగంలోనైనా లేదా ఫీల్డ్‌లోనైనా, లేదా ఎక్కడ కేటాయిస్తే అక్కడ పని చేయవలసి ఉంటుంది.

నెలసరి ఉపకారవేతనం : 
మొదటి 6 నెలలు : రూ 10,000/–
తదుపరి 6 నెలలు : రూ 12,000/–
ట్రైనీగా ఏడాది పాటు : రూ 15,000/– 

కనీస అర్హతలు : 
తెలుగు భాషలో ప్రావీణ్యం 
ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం – గ్రాడ్యుయేషన్‌ పట్టా
వయోపరిమితి : 09–06–2019 నాటికి 30 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. 

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు చేయడానికి చివరి తేది : మే 28 (మంగళవారం)  
రాతపరీక్ష : జూన్ 9 (ఆదివారం)
రాతపరీక్ష ఫలితాలు : జూన్‌ 24 (సోమవారం)
ఇంటర్వ్యూలు : జులై 8 నుంచి 13 వరకు 
తుది ఫలితాలు : జులై 22 (సోమవారం)
తరగతుల నిర్వహణ : జులై 29 (సోమవారం) నుంచి...

చిరునామ :  ప్రిన్సిపాల్, సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం, 6వ అంతస్తు, ఎం.జి.ఆర్‌.ఎస్టేట్స్, మోడల్‌ హౌస్‌ వెనుక, పంజగుట్ట, హైదరాబాద్‌ – 500082. 
ఫోన్‌ : 040 2335 4715, సమయం : ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు)

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్‌ చేయండి.

www.sakshischoolofjournalism.com

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top