అధ్యయన శాస్త్రాలు | Economic Botany | Sakshi
Sakshi News home page

అధ్యయన శాస్త్రాలు

Nov 5 2015 1:20 AM | Updated on Sep 3 2017 12:00 PM

కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం. అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం. ఎకాలజీ: మొక్కలు,

సైటాలజీ:  కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం. అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం. ఎకాలజీ: మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం. ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ): మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు. ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం.

 టిక్స్:
 జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం.
 పేలినాలజీ: పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం.
 పేలియోబోటనీ:
 వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం.
 టాక్సానమీ: మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం.
 మైకాలజీ:
 వివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం.
 పాథాలజీ: మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
 ఫైకాలజీ: ఆల్గేల అధ్యయనం. దీన్నే ఆల్గాలజీ అంటారు.
 బ్రయాలజీ: బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్‌వార్ట్స్, మాస్).
 టెరిడాలజీ: ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం.
 జువాలజీ: ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం.
 హిస్టాలజీ: కణజాలాల శాస్త్రం.
 ఎండోక్రైనాలజీ: అంతస్స్రావక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం).
 ఎంటమాలజీ: కీటకాల అధ్యయన శాస్త్రం.
 పేలియోజువాలజీ:
 జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం.
 ఆర్నిథాలజీ: పక్షుల అధ్యయన శాస్త్రం.
 హెల్మింథాలజీ:
 పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం.
 లెపిడోటెరాలజీ: సీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం.
 లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం.
 మయాలజీ: కండరాల అధ్యయన శాస్త్రం.
 ఓఫియాలజీ: పాముల అధ్యయన శాస్త్రం.
 మైక్రోబయాలజీ:
 సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
 బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
 వైరాలజీ: వైరస్‌ల అధ్యయన శాస్త్రం.
 ఆగ్రోస్టాలజీ: గడ్డి అధ్యయన శాస్త్రం.
 హైడ్రాలజీ:
 భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం.
 హైడ్రోపోనిక్స్: (నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
 హార్టీకల్చర్: తోటల పెంపకం.
 ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం.
 పెడాలజీ: నేలల అధ్యయన శాస్త్రం.
 విటికల్చర్: ద్రాక్షతోటల పెంపకం.
 సిల్వీకల్చర్: కలపనిచ్చే చెట్ల పెంపకం.
 ఇక్తియాలజీ: చేపల అధ్యయన శాస్త్రం.
 పోమాలజీ:
 పండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం.
 ఒలెరీకల్చర్: కూరగాయల పెంపకం.
 ఎపీకల్చర్: తేనెటీగల పెంపకం.
 టిష్యూకల్చర్: కణజాలాల సంవర్ధనం.
 పిసికల్చర్: చేపల పెంపకం.
 వర్మికల్చర్: వానపాముల పెంపకం.
 కార్డియాలజీ: మానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 ఆఫ్తల్మాలజీ: మానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.మ్యునాలజీ: మానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం.
 డెర్మటాలజీ: మానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 హెమటాలజీ: రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
 గైనకాలజీ:
 స్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
 హెపటాలజీ: కాలేయ అధ్యయన శాస్త్రం.
 పీడియాట్రిక్స్: చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 న్యూరాలజీ:
 నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం.
 ఆంకాలజీ: కేన్సర్ అధ్యయన శాస్త్రం.
 జెరియాట్రిక్స్: వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 రుమటాలజీ: కీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
 ఆంజియాలజీ:
 రక్తనాళాల అధ్యయన శాస్త్రం.
 పల్మనాలజీ:
 ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం.
 క్రేనియాలజీ: మానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం. దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు.
 నెఫ్రాలజీ: మూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
 క్రిమినాలజీ:
 నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం.
 టాక్సికాలజీ:
 విషంపై అధ్యయనం చేసే శాస్త్రం.
 క్రిప్టోగ్రఫీ: రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం.
 ట్రైకాలజీ: మానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం.
 థానటాలజీ:
 మృత్యువుపై అధ్యయనం చేసే శాస్త్రం.
 ఆస్ట్రానమీ: ఖగోళ అధ్యయన శాస్త్రం.
 సీస్మాలజీ: భూకంపాల అధ్యయన శాస్త్రం.
 లిథాలజీ: శిలల అధ్యయన శాస్త్రం.
 ఓరాలజీ: పర్వతాల అధ్యయన శాస్త్రం.
 కాస్మోలజీ:
 విశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం.
 సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
 మెటియోరాలజీ:
 వాతావరణ అధ్యయన శాస్త్రం.
 పోటమాలజీ: నదుల అధ్యయన శాస్త్రం.
 అకౌస్టిక్స్: ధ్వని అధ్యయన శాస్త్రం.
 ప్టిక్స్: కాంతి అధ్యయన శాస్త్రం.
 క్రయోజెనిక్స్: అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం.
 థియోలజీ:
 వివిధ మతాల అధ్యయన శాస్త్రం.
 సోషియాలజీ: సమాజ అధ్యయన శాస్త్రం.
 డెమోగ్రఫీ: మానవ జనాభా అధ్యయన శాస్త్రం (జననాలు, మరణాల వంటి గణాంకాలు).
 పెడగాగీ:
 బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం.
 ఫిలాటలీ: స్టాంపుల సేకరణ.
 న్యూమిస్‌మ్యాటిక్స్:
 నాణేల అధ్యయన శాస్త్రం.
 లెక్సికోగ్రఫీ:
 నిఘంటువుల అధ్యయన శాస్త్రం.
 ఎటిమాలజీ: పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
 న్యూమరాలజీ: సంఖ్యా శాస్త్రం.
 సెఫాలజీ: ఎన్నికల అధ్యయన శాస్త్రం.
 ఫొనెటిక్స్: భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement