అధ్యయన శాస్త్రాలు
సైటాలజీ: కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం. అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం. ఎకాలజీ: మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం. ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ): మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు. ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం.
టిక్స్:
జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం.
పేలినాలజీ: పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం.
పేలియోబోటనీ:
వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం.
టాక్సానమీ: మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం.
మైకాలజీ:
వివిధ రకాల ఫంగస్ల అధ్యయన శాస్త్రం.
పాథాలజీ: మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
ఫైకాలజీ: ఆల్గేల అధ్యయనం. దీన్నే ఆల్గాలజీ అంటారు.
బ్రయాలజీ: బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్వార్ట్స్, మాస్).
టెరిడాలజీ: ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం.
జువాలజీ: ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం.
హిస్టాలజీ: కణజాలాల శాస్త్రం.
ఎండోక్రైనాలజీ: అంతస్స్రావక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం).
ఎంటమాలజీ: కీటకాల అధ్యయన శాస్త్రం.
పేలియోజువాలజీ:
జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం.
ఆర్నిథాలజీ: పక్షుల అధ్యయన శాస్త్రం.
హెల్మింథాలజీ:
పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం.
లెపిడోటెరాలజీ: సీతాకోకచిలుకలు, మాత్ల అధ్యయన శాస్త్రం.
లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం.
మయాలజీ: కండరాల అధ్యయన శాస్త్రం.
ఓఫియాలజీ: పాముల అధ్యయన శాస్త్రం.
మైక్రోబయాలజీ:
సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
వైరాలజీ: వైరస్ల అధ్యయన శాస్త్రం.
ఆగ్రోస్టాలజీ: గడ్డి అధ్యయన శాస్త్రం.
హైడ్రాలజీ:
భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం.
హైడ్రోపోనిక్స్: (నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
హార్టీకల్చర్: తోటల పెంపకం.
ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం.
పెడాలజీ: నేలల అధ్యయన శాస్త్రం.
విటికల్చర్: ద్రాక్షతోటల పెంపకం.
సిల్వీకల్చర్: కలపనిచ్చే చెట్ల పెంపకం.
ఇక్తియాలజీ: చేపల అధ్యయన శాస్త్రం.
పోమాలజీ:
పండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం.
ఒలెరీకల్చర్: కూరగాయల పెంపకం.
ఎపీకల్చర్: తేనెటీగల పెంపకం.
టిష్యూకల్చర్: కణజాలాల సంవర్ధనం.
పిసికల్చర్: చేపల పెంపకం.
వర్మికల్చర్: వానపాముల పెంపకం.
కార్డియాలజీ: మానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
ఆఫ్తల్మాలజీ: మానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.మ్యునాలజీ: మానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం.
డెర్మటాలజీ: మానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం.
హెమటాలజీ: రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
గైనకాలజీ:
స్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
హెపటాలజీ: కాలేయ అధ్యయన శాస్త్రం.
పీడియాట్రిక్స్: చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
న్యూరాలజీ:
నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం.
ఆంకాలజీ: కేన్సర్ అధ్యయన శాస్త్రం.
జెరియాట్రిక్స్: వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
రుమటాలజీ: కీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
ఆంజియాలజీ:
రక్తనాళాల అధ్యయన శాస్త్రం.
పల్మనాలజీ:
ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం.
క్రేనియాలజీ: మానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం. దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు.
నెఫ్రాలజీ: మూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
క్రిమినాలజీ:
నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం.
టాక్సికాలజీ:
విషంపై అధ్యయనం చేసే శాస్త్రం.
క్రిప్టోగ్రఫీ: రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం.
ట్రైకాలజీ: మానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం.
థానటాలజీ:
మృత్యువుపై అధ్యయనం చేసే శాస్త్రం.
ఆస్ట్రానమీ: ఖగోళ అధ్యయన శాస్త్రం.
సీస్మాలజీ: భూకంపాల అధ్యయన శాస్త్రం.
లిథాలజీ: శిలల అధ్యయన శాస్త్రం.
ఓరాలజీ: పర్వతాల అధ్యయన శాస్త్రం.
కాస్మోలజీ:
విశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం.
సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
మెటియోరాలజీ:
వాతావరణ అధ్యయన శాస్త్రం.
పోటమాలజీ: నదుల అధ్యయన శాస్త్రం.
అకౌస్టిక్స్: ధ్వని అధ్యయన శాస్త్రం.
ప్టిక్స్: కాంతి అధ్యయన శాస్త్రం.
క్రయోజెనిక్స్: అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం.
థియోలజీ:
వివిధ మతాల అధ్యయన శాస్త్రం.
సోషియాలజీ: సమాజ అధ్యయన శాస్త్రం.
డెమోగ్రఫీ: మానవ జనాభా అధ్యయన శాస్త్రం (జననాలు, మరణాల వంటి గణాంకాలు).
పెడగాగీ:
బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం.
ఫిలాటలీ: స్టాంపుల సేకరణ.
న్యూమిస్మ్యాటిక్స్:
నాణేల అధ్యయన శాస్త్రం.
లెక్సికోగ్రఫీ:
నిఘంటువుల అధ్యయన శాస్త్రం.
ఎటిమాలజీ: పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
న్యూమరాలజీ: సంఖ్యా శాస్త్రం.
సెఫాలజీ: ఎన్నికల అధ్యయన శాస్త్రం.
ఫొనెటిక్స్: భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం.