పెద్దాపురంలో రైస్‌ మిల్లుపై.. | Sakshi
Sakshi News home page

పెద్దాపురంలో రైస్‌ మిల్లుపై..

Published Sat, Feb 10 2018 11:35 AM

Vigilance officers checks in rice mill - Sakshi

తూర్పుగోదావరి, పెద్దాపురం: విజిలెన్స్‌ ఎస్పీ గంగాధర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు పెద్దాపురం పట్టణంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ డీఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి, సీఐ బి.సాయిరమేష్‌  తహసీల్దార్‌ గోపాలరావులకు అందిన సమాచారం మేరకు స్థానిక నాగంపేట సమీపంలోని సూర్య  రైసుమిల్లులో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుమారు 450 కేజీల అక్రమ రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. దీంతో మిల్లులో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువ గల బియ్యం, ధాన్యంతో పాటు అక్రమ రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సాయి రమేష్‌ తెలిపారు. మిల్లు అధినేత బి ప్రసాద్‌పై ఆహార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు తరలించనున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement