'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్' | ysrcp MP ys avinash reddy takes on kadapa district collector | Sakshi
Sakshi News home page

'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్'

Jul 22 2015 7:06 PM | Updated on May 29 2018 4:23 PM

'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్' - Sakshi

'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్'

కడప జిల్లా కలెక్టర్ జిలా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.

న్యూఢిల్లీ: కడప జిల్లా కలెక్టర్ జిలా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులెవ్వరినీ ఏ కార్యక్రమానికీ పిలవడంలేదని అన్నారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేయకుండా కలెక్టర్ ఆపేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేసి కడపకు 44 వేల క్యూసెక్కుల నీరు అందించారని చెప్పారు. అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా మంత్రి దేవినేని ఉమ అడ్డుపడుతున్నారని విమర్శించారు. గాలేరు. నగరి పనులు తక్షణమే పూర్తి చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయితీలు ఇచ్చేలా పార్లమెంట్లో పోరాడుతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement