గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి, కోనా రఘుపతి తదితరులు కలిశారు.
గుంటూరు: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి, కోనా రఘుపతి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు.
పట్టిసీమ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు నీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమి చేస్తోందని వారు ప్రశ్నించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.