ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి వేలల్లో బిల్లులా? | ys jaganmohan reddy fires on access electricity charges | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి వేలల్లో బిల్లులా?

Apr 4 2016 9:07 PM | Updated on Sep 5 2018 2:25 PM

వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కనుంపల్లి గ్రామవాసులు సోమవారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు.

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కనుంపల్లి గ్రామవాసులు సోమవారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. గిరిజనులైన తమకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వాల్సింది పోయి వేల రూపాయల్లో బిల్లులు చెల్లించాలంటే వారు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement