
వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం రెండవ రోజు పర్యటిస్తున్నారు. ముందుగా ఆయన ఇవాళ ఉదయం వెంకటగిరిలోని శ్రీపోలేరమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వెంకటగిరిలో చేనేత కార్మికులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు.
రెండు వారాలుగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని, అధైర్య పడొద్దని వారికి భరోసా కల్పించనున్నారు. నిన్న చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. నేడు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, వాకాడు, గూడూరు, సూళ్లురుపేటలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.