ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర | Ys jagan mohan reddy to tour sixth day raith bharosa yatra in Anatapur district | Sakshi
Sakshi News home page

ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర

Jan 11 2016 10:24 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర - Sakshi

ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరుకుంది.

అనంతపురం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆర్‌డీటీ గెస్ట్‌హౌస్‌ నుంచి వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. సిండికేట్‌ నగర్‌, రాచానపల్లిలో వైఎస్‌ జగన్‌కు అక్కడి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

తొలుత కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆ తరువాత కోనాపురం గ్రామంలో రైతు నరేంద్ర కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. అనంతరం పాతపాలెంలో రైతు సుధాకర్‌ రెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement