యువతి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ : యువతి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాలకు చెందిన యువకుడు కుమార్ను యువతి వేధింపులుకు గురి చేస్తుంది. ఆ క్రమంలో ఇటీవల మరీ వేధింపులు అధికమయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఆశ్రయించాడు.
	అయినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు శనివారం సూసైడ్ నోటు రాసి పురుగుల మందు సేవించాడు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
