
ఆశీర్వాదం
పార్టీ నాయకులు అట్ల చిన వెంకటరెడ్డి కుమారుడు కోటిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ఆశీర్వదించారు.
♦ వైఎస్‌ఆర్‌సీపీ నేత అట్ల చిన వెంకటరెడ్డి
♦ కుమారుడు కోటిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
♦ అధినేత వైఎస్ జగన్ గురువారం ఆశీర్వదించారు.
♦ అట్ల చినవెంకటరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడిన జగన్
♦ పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ నాయకులు అట్ల చిన వెంకటరెడ్డి కుమారుడు కోటిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ఆశీర్వదించారు. ఈ నెల 13న వెంకటరెడ్డి కుమారుడు కోటిరెడ్డి, అతని అన్న శ్రీనివాసరెడ్డి కుమారుడు వీర రాఘవరెడ్డి వివాహం సంతమాగలూరులో జరగనుంది. గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ గురువారం మధ్యాహ్నం సంతమాగలూరు చేరుకుని చినవెంకటరెడ్డి కుటుంబంతో కొద్దిసేపు గడిపారు. పెళ్లి కుమారులిద్దరినీ ఆశీర్వదించారు. జగన్ రాక తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
అనంతరం జగన్ గ్రామ సర్పంచి గడ్డం వెంకటరెడ్డి వెళ్లి కొద్ది సమయం గడిపారు. అనంతరం గుంటూరు జిల్లాకు వెళ్లారు. ఈ పర్యటనలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, ఆయోద్య రామిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు వరికూటి అమృతపాణి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, గొట్టిపాటి భరత్, డీవీ శేషారెడ్డి, బుర్రా మధుసూధన్‌యాదవ్, వరికూటి అశోక్‌బాబు, ఎస్. రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కసుకుర్తి ఆదెన్న, బాచిన చెంచుగరటయ్య, కేవీ రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.