గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి | Women Killed in Road Accident | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Sep 27 2016 11:36 PM | Updated on Sep 4 2017 3:14 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

మండలంలోని గానుగపెంటకు చెందిన గోగు వెంకటమ్మ (65)ను మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

పోరుమామిళ్ల:  మండలంలోని గానుగపెంటకు చెందిన గోగు వెంకటమ్మ (65)ను మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  వివరాలిలా ఉన్నాయి. గోగు రామ్మూర్తి భార్య వెంకటమ్మ రాత్రి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు వాహనం ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయింది. తల రాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 30 ఏళ్లుగా ఆమె గానుగపెంటలో  కూతురు దగ్గర ఉంటూ టిఫన్‌ సెంటర్‌ నడుపుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement