వివాహిత ఆత్మహత్య | woman suicides in bhairavani thippa | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jul 2 2017 11:06 PM | Updated on Sep 5 2017 3:02 PM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

రాయదుర్గం టౌన్‌ : బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శివప్ప భార్య వసంతమ్మ (24) ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. కొద్దిసేపటి తర్వాత బంధువులు గుర్తించి రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. కడుపునొప్పి భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement