బైక్ , ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెంది మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Nov 9 2016 11:12 PM | Updated on Apr 3 2019 7:53 PM
నందికొట్కూరు: బైక్ , ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెంది మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని జీవన్‌జ్యోతి హైస్కూల్ వద్ద చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకొని ఐదుగురు కూలీలు నందికొట్కూరుకు వస్తున్న ఆటోలో వస్తున్నారు.ప్రాతకోటకు చెందిన పుల్లయ్య, బాలు, తిరుపాల్‌లు మోటారు సైకిల్‌పై స్వగ్రామానికి బయలు దేరారు. మార్గమధ్యంలో బైక్, ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన పుల్లమ్మ(45) తీవ్రంగా గాయపడింది. బైక్‌పై ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పుల్లమ్మను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.
Advertisement
Advertisement