మండల పరిధిలోని బత్తులూరుపాడు గ్రామ సమీపంలో సోమవారం రాత్రి లారీ ఢీకొని ఓ మహిళ మృతిచెందారు.
లారీ ఢీకొని మహిళ దుర్మరణం
Jan 31 2017 12:31 AM | Updated on Jun 4 2019 5:04 PM
బనగానపల్లె రూరల్ : మండల పరిధిలోని బత్తులూరుపాడు గ్రామ సమీపంలో సోమవారం రాత్రి లారీ ఢీకొని ఓ మహిళ మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. యనకండ్ల గ్రామానికి చెందిన నాగభూషణం రెడ్డి, భార్య లక్ష్మీదేవి (30)తో కలిసి కొంత కాలంగా గోర్లగుట్ట గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం లక్ష్మీదేవి పుట్టినిల్లు అయిన వెంకటాపురానికి వెళ్లారు. తిరిగి సోమవారం కూతురు సుధాభాగ్యలక్ష్మితో కలిసి భార్యాభర్త గోర్లగుట్టకు మోటార్ సైకిల్‌పై బయలుదే రారు. బత్తులూరుపాడు గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పింది. దీంతో బైక్ వెనుక కూర్చున లక్ష్మీదేవి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి లక్ష్మీదేవి తల పై ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి సుధా భాగ్యలక్ష్మికి స్వల్ప గాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాకేష్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement